బిడ్డను కళ్లారా చూడకుండానే మత్స్యకారుడి మృతి.. కన్నీరు పెట్టించే ఘటన

లాక్‌డౌన్‌‌తో కరోనా వైరస్ కట్టడి ఎలా ఉన్నా.. దాని కారణంగా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంటోంది. చాలామంది తమ ఆత్మీయులను చివరిచూపు చూసుకోలేని పరిస్థితి నెలకొంటోంది. ఇలాగే లాక్‌డౌన్ కారణంగా శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి కన్నబిడ్డను చూసుకోకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.

Also Read:

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మాగుపల్లి కామరాజు (23) మత్స్యకారుడు. చేపల వేట ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉపాధి పొందుతుంటాడు. ఈ విధంగానే గత జనవరి నెలలో మరికొందరు మత్స్యకారులతో కలిసి గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికి అతడి భార్య గర్భవతి. ఫిబ్రవరి నెలలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కన్నబిడ్డను చూసేందుకు మార్చి చివరి వారంలో కామరాజు ఇంటికే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో అతడి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది.

Also Read:

ఈ క్రమంలోనే కామరాజు అనారోగ్యానికి గురై గుజరాత్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి మత్స్యకారులు ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. బిడ్డను చూసేందుకు భర్త వస్తాడని వేయి కళ్లతో చూస్తున్న ఆ మహిళ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడి వారే అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ విషయం తెలుసుకున్న మత్య్సశాఖ అధికారులు కామరాజు కుటుంబాన్ని పరామర్శించి వివరాలు సేకరించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here