ఆంధ్రజ్యోతి మాజీ ఇప్పుడెక్కడ?

ఆంధ్రజ్యోతికి రాజీనామా చేసిన బ్యూరో చీఫ్ చంద్ర శేఖర్ శర్మ ఎక్కడకి వెళ్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సాక్షికి గానీ, నమస్తే తెలంగాణకి గానీ వెళ్తాడని గట్టిగా టాక్ వచ్చింది. అయితే శర్మ మాత్రం అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు  పెద్దగా ఊరు, పేరు ఎవరికీ తెలియని “మనం” అనే పత్రికకు సీఈఓగా వెళ్ళాడని విశ్వసనీయ సమాచారం. సహజంగానే దూకుడుగా ఉండే శర్మ, ఈ పత్రిక విషయంలో ఎలా ఉంటాడో అని ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకు కేవలం బ్యూరో చీఫ్ పదవి లో మాత్రమే ఉన్న శర్మ, దాదాపు ఒక పత్రికను నిర్వహించగలరా? అది కూడా ఆషా మాషీగా కాకుండా మెయిన్ ఎడిషన్, టాబ్లాయిడ్ లతో వస్తోందని అంటున్నారు. ఇప్పటికే సిబ్బంది కూడా సిద్ధం అవుతున్నారట. అమీర్ పేటలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కార్పొరేట్ తరహాలో ఆఫీస్ ఓపెన్ అయ్యింది కూడా.

ఆంధ్రజ్యోతి పత్రికకి అటు కంటెంట్ పరంగా, ఇటు కరెన్సీ (ప్రకటనల) పరంగా అద్భుతాలు చూపించిన శర్మ లేకపోవడం పెద్ద లోటే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో జీవవైవిధ్య సదస్సు జరిగినప్పుడు ఏడాది ముందే దాని గురించి ఒక కర్టెన్ రైజర్ ఐటెంతో పాటు, ప్రత్యేక సంచిక ఇచ్చి కోటి రూపాయల ప్రకటనలు తెచ్చాడు. సదస్సు సమయంలో మరో కోటి తెచ్చాడు. అంత కెపాసిటీ ఉన్న శర్మ ఇప్పుడు ఇంత చిన్న పత్రికకు ఏం చేస్తాడో అని ఆసక్తిగా ఉన్నారు.

ఏమిటీ మనం?
మనం అనే పత్రిక గురించి వెబ్ లో సెర్చ్ చేస్తే పెద్దగా ఏమి కనిపించలేదు. ఇలాంటి పత్రికను శర్మ ఏం చేస్తాడో చూడాలి మరి. చిన్న, చితక పత్రికలు చాలానే ఉన్నా, ఇంత కార్పొరేట్ స్థాయిలో స్టార్ట్ అవుతున్నవి మాత్రం లేవు. ఇప్పుడు మరి ఈ కొత్త పత్రిక ఏం చేస్తుందో, ఎంత కాలంలో తన ప్రభావం చూపిస్తుందో చూడాలి. దీని గురించి మరిన్ని అప్ డేట్స్ త్వరలో వస్తాయి.. ఎదురు చూడండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here