ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డంకి కాలేద‌ని నిరూపించిన డైర‌క్ట‌ర్ , హీరోయిన్

త‌మిళ‌నాట హీరోయిన్, డైర‌క్ట‌ర్ ల ప్రేమ‌పెళ్లి సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ పెళ్లి హాట్ టాపిగ్గామారింది. కోలివుడ్,  త‌మిళం, తెలుగు లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసిన డైర‌క్ట‌ర్ వేలు ప్ర‌భాక‌రన్ (60) పెళ్లిపీఠ‌లెక్కాడు. తెలుగులో ఓ ద‌ర్శ‌కుడి ప్రేమ డైరీ సినిమా డైర‌క్ట‌ర్ గా, హీరోగా  తెర‌కెక్కించాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ష‌ర్లీ దాస్ (30) హీరోయిన్ గా న‌టించింది.
ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అప్ప‌టినుంచి ప్రేమ‌లో మునిగితేలుతున్న ఈ ప్రేమికులు పెళ్లి చేసుకోవ‌డం షాక్ గురి చేసింది.
వేలు ప్ర‌భాక‌రన్ డైర‌క్ట్ చేసిన  ఓ చిత్రం శుక్ర‌వారం విడుద‌లైంది. ఆ సినిమా ఫ్రివ్యూ చూసేందుకు ఫోర్ ఫ్రేమ్స్ కు వ‌చ్చిన వీరిద్ద‌రు థియేట‌ర్ లో ప్ర‌భాక‌రన్, న‌టి షెర్లీ వివాహం చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు.
అంతే ఒక్క‌సారి కంగుతిన్న సినీ ప్రేమికులు వీరి పెళ్లిగురించి ఆరాతీశారు. అందుకు కార‌ణం ప్ర‌భాక‌రన్ వ‌య‌సు 60, అయితే షెర్లీ దాసు వ‌య‌సు 30. మ‌రో విశేషం ఏంటంటే  ఓ వృద్ద దర్శకుడు హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే కథాంశంతో తెరకెక్కిన ఓ దర్శకుడి ప్రేమ డైరీ చిత్రం విడుదల రోజునే మీడియా ముందు నిజజీవితంలో ఒక్కటి కావటం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here