పాకిస్తాన్ వ్యాప్తంగా పగిలిన టీవీలు..వెక్కివెక్కి ఏడ్చిన ప్రజలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొడుతుంది. నిన్న ఎడ్జ్ బాస్టన్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అన్నీ ఫార్మాట్లలో పాక్ పై తన పవర్ ఏంటో చూపించిన భారత్ నిర్ణీత ఓవర్లలో 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. మ్యాచ్ మధ్యలో వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో  41ఓవర్లకు కుదించారు. లక్ష్య చేదనలో బ్యాటింగ్ దిగిన పాక్ బ్యాట్స్ మెన్లు వెన్నులో వణుకు పుట్టించిన భారత బౌలర్లు పాక్ ను 164 పరుగులకే అలౌట్ చేశారు. అయితే ఈ మ్యాచ్ తమదేశం గెలుస్తుందని భారత ప్రజలు..కాదు తమదేశం గెలుస్తుందని పాక్ ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. కానీ భారత బౌలర్ల ధాటికి పాక్ చిత్తు కాగా దీనిపై ఆగ్రహించిన పాక్ ప్రజలు టీవీలు పగుల కొట్టి నానా విధ్వంసం సృష్టించారు.

భారతీయలు మ్యాచ్ మజాను ఎంజాయ్ చేస్తుంటే దాయాది దేశం  కన్నీరుమున్నీరయ్యింది. కడుపుమంటతో దేశం వ్యాప్తంగా ఉన్న టీవీల్ని పగలగొట్టి తమ ప్రతాపాన్నిచూపారు. ఎందుకు టీవీ పగలగొడుతున్నారనే ప్రశ్నిస్తే తమ దేశం ఓడిపోయినందుకు కాదు మా బాధ ..భారత్ గెలిచినందుకు అని  వెక్కివెక్కి ఏడ్చారు. ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కాగా భారతీయులు మాత్రం ఆటలో ఓడిపోతే స్పోర్టీవ్ గా ఉండాలి కానీ ఇలా టీవీలు పగలగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కోపతాపాలకు పోకుండా ప్రజలు లౌక్యంగా ఐకమత్యం కలిసి మెలిసి ఉండాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here