భారత్ – పాక్ మ్యాచ్ లో గజదొంగ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై  భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరిగే సమయంలో భారత్ కు చెందిన ఓ గజదొంగ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు భారత మాజీక్రికెటర్లతో సంభాషించి అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. మ్యాచ్ మధ్యలో ఉన్న  ఆ గజదొంగ ఎవరా అని ఆరాతీస్తే ఆయనే లిక్కర్ కింగ్ విజయమాల్యా అని తెలిసింది. అంతే మ్యాచ్ చూసే భారతీయులు మాల్యాను తమ సెల్ఫీలు బంధించారు. ఆ ఫోటోలకి భారత్ పాక్ మ్యాచ్ లో గజదొంగ అని క్యాప్షన్ ఇచ్చిసోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఓ ఎంపీగా కింగ్ ఫిషర్ కోసం పలు బ్యాంకుల్లో ఆరువేలకోట్లు టోపీ పెట్టి ఇండియా వదిలి పారిపోయాడు. గతంలో ఐపీఎల్ లో బెంగళూరు టీమ్ యజమానిగా ఉన్న మాల్యా క్రికెట్ పై ఉన్న మక్కువ చంపుకోలేక నిన్నటి ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్ లో ప్రత్యక్షమయ్యాడు. వైట్ కోట్ ధరించి రెగ్యులర్ స్టైల్లో అగుపించాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు సినీల్ గవాస్కర్ తో మాల్యా ముచ్చటిస్తుండగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలే ప్రస్తుతం ట్రెండ్ అయ్యాయి. కాగా డీఫాల్టర్ గా ఉన్న మాల్యాను పట్టుకోవాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే..భారత్ నుంచి పారిపోయి ఇలా మ్యాచ్ లో ప్రత్యక్షమవ్వడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here