గోళ్లు ఎప్పుడు తీసుకోవాలి

గోళ్లను గురించి మనం తెలుసుకోవలసిన, చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కొంతమందికి కోపం వచ్చినప్పడు అదే పనిగా గోళ్లు కొరకడం చేస్తుంటారు. అది ఆరోగ్య రిత్యా నష్టం. దరిద్రాన్ని కొనితెచ్చిపెడుతుందట. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే తరచూ గోళ్లను కట్ చేసుకోవాలి. అయితే ఈ గోళ్లను కూడ కొన్ని పద్దతుల్ని పాటించి వాటిని తొలగించుకోవాలి. లేదంటే మన నట్టింట్లో దరిద్రం తాండవిస్తుంది.

గోళ్లు తీసే సమయం

గోళ్లను సూర్యోదయానికి ముందే తీయాలి. సూర్యాస్తమైన తరువాత గోళ్లను ఎట్టిపరిస్థితుల్లో తీయకూడదు. కొరకకూడదు. అలా చేస్తే దరిద్రం, అశాంతి కలుగుతుంది. గడపమీద కానీ, ఇంటి మధ్యలో కానీ , జుట్టువిరబోసుకొని కానీ మలమూత్ర విసర్జన చేస్తూ కానీ గోళ్లు కత్తిరించుకోకూడదు.

గోళను తీసుకోవాల్సిన వారాలు:

మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎట్టిపరిస్థితుల్లో గోళ్లను కట్ చేయకూడదు. అమావాస్య వచ్చినప్పుడు గోళ్లు కత్తిరించరాదు. అర్ధరాత్రి 12గంటలనుంచి పొద్దున్నే వరకు మాటవరసకు కూడా గోళ్లను తీయరాదు. ఇంట్లో పడుకునే గదిలో గోళ్లను తీయకూడదు. అలా చేయడం వల్ల ఇంటికి అరిష్టం, అనారోగ్య సమస్యల్ని కొనితెచ్చుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here