కాణిపాకం విశిష్టత ఏంటో తెలుసా

వినాయక చవితి అంటే వినాయకుడు గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాణిపాకం వినాయకుడు. మనం ఏ శుభం కార్యం చేయాలన్న మొదట వినాయకుణ్ని పూజిస్తాం. అలాంటి వినాయకుడు వెలిసిన పుణ్యక్షేత్రం కాణిపానికి ఓ ప్రసిద్ధి ఉంది.
చిత్తూరు జిల్లాలో కొలువైన ఉన్న కాణిపాకం అనే గ్రామంలో పూర్వం అందులైన ముగ్గురు అన్నదమ్ములు ఉండే వారు. వారు వ్యవసాయం నిమిత్తం బావిని తవ్వించారు. రానురాను ఆ బావిలోని నీళ్లు ఎండిపోవడంతో …బావిని తవ్వితే నీళ్లొస్తాయనే నమ్మకంతో రోజు తవ్వడం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ బావిలో నీళ్లు రాకపోగా ఓ రాయి తగిలి నెత్తురు ఏరైలా పారింది.
దీంతో రాయిని బయటికి తీసిన అన్నదమ్ములు పూజించడంతో వారికి  అందత్వం పోయి సాదారణస్థితికి వచ్చారు. ఈ సంఘటన దావనంలా తెలియండంతో భక్తులు పూజలు చేసేవారు. అలా పూజలు చేసిన కొబ్బరి నీరు పావు ఎకరము అంత విస్తీర్ణము పారింది. దానితో ఆ స్థలానికి “కాణిపరకం ” అనే తమిళ పేరు వచ్చింది, అదే వాడుకలోకి వచ్చెటప్పటికి “కాణిపాకం” గా మారింది. ఈ ఆలయాన్ని పదకొండవ శాతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. ఇంకో విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో బావి ఎంత ఎండ ఉన్నా కానీ నీటి ఊట మాత్రం తగ్గదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here