దేవుని పూజ ఎప్పుడు ..? ఎలా చేయాలి…?

మనం ఇంట్లో నిత్యం దైవార్చన చేస్తుంటాం. ఆ దైవార్చన ఏ సమయంలో చేయాలి. ఎలాంటి నియమాలు పాటించాలని అనే దానిపై పండితులు పలు సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు పాటించడం వల్ల దైవానుగ్రహం పొందవచ్చునట.
ప్రతీ రోజు ఇంట్లో దేవునికి పూజలు చేయాలి. ఆ పూజలు చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి.  సూర్యోదయానికి గంటన్నర ముందే ఉండే సమయాన్ని రౌద్రి ముహుర్తం అంటారు. రౌద్రీ ముహూర్తం ముందు ఉండే ముహుర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అందుకే ప్రతీ ఒక్కరు బ్రాహీ మూహుర్తంలో నిద్రలేవాలి.
బ్రాహీ మూహుర్తం అంటే   “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం”  ఆయురారోగ్యాలతోపాటు, అనుకున్నది సాధించాలంటే శుభారంభ దినం. నిద్రలేచిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి.  ఐదు నుంచి ఆరు లోపల దేవ స్నానం . దేవ స్నానమే దేవునికి స్నానం చేసి అభిషేకం చేసే సమయం. అనంతరం రౌద్రీ మూహుర్తం లో ఐదు నుంచి ఏడుగంటల మధ్యలోనే పూజలు చేయాలి. పూజ ముందు నిర్మాల్యాన్ని తొలగించాలి.
అంటే దేవుడికి అలంకరించిన పువ్వుల్ని దండల్ని బొటన వేలు, చూపుడు వేలుతో వాటిని తొలగించాలి. పూజ చేసేటప్పుడు మృగీ ముద్రతో చేయాలి. మృగీ ముద్ర  అంటే చిటికెన వేలు, చూపుడు వేలు తగలకుండా మిగిలిన  ముడు వేళ్లతో పూజ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here