రావణాసురుడిని మోసం చేసిన సీత

రావణాసురిడి  చెరలో ఉన్నది మాయా సీత  ఉన్నదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాల్మికి రామాయణానికి ఎంత ప్రసిద్ధి ఉందో. చిత్రరామాయణం, ఆనంద రామాయణం అలాంటి ప్రసిద్ధి ఉంది. ఈ రామాయణాల్లో రావణాసురిడి చెరలో ఉన్నది మాయ సీతనా..? అసలు సీత ఎక్కడ ఉంది. సీత ఏ వస్త్రాలు ధరించింది. ఆహారం ఏం తిన్నది. ఎక్కడ పడుకున్నది. అశోక వనంలో ఉన్న ఆ సీత ఏ విధమైన దుర్భుర బాధను అనుభవించింది. ఇలా ప్రశ్నలకు సమాధానాలన్నీ వాటిల్లో దొరుకుతాయి. అయితే సీతా దేవిని రావణాసురుడు అపహరించినప్పుడు అగ్ని హోత్రుడు సీతాదేవి స్థానంలో మాయా సీతను ఉంచాడు. అనంతరం  అసలు సీతా దేవిని అశోకవనంలో ఉంచుతాడు.

అలా రావణ వధ అనంతరం శ్రీ రామడు మాయా వేషంలో ఉన్న సీతా దేవిని అగ్నిప్రవేశం చేయమని కోరగా ..భర్త అడుగుజాడల్లో నడిచే సీతా దేవి అగ్ని ప్రవేశానికి అంగీకరిస్తుంది. ఆ సందర్భంగా అగ్నిహోత్రుడు మాయా సీతను స్వీకరించి నిజమైన సీతను అప్పగించాడు. అలా రావణాసురుడిని మోసం చేసిన సీత..అశోక వనంలో ఉంది అని చిత్ర రామాయం అనే రామాయణంలో ఇలా వర్ణించబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here