సచిన్ ఫాన్స్ కి పండగ లాంటి ట్రైలర్ రాబోతోంది

భారత దేశ సినిమా చరిత్ర లో ఎన్నడూ లేనంతగా బయో పిక్ ల మీద డైరెక్టర్ లు దృష్టి పెట్టారు. మహేంద్ర సింగ్ ధోనీ బయో పిక్ సూపర్ హిట్ అవ్వడం తో బయో పిక్ ల హవా ఎక్కువగా ఉంది. రెగ్యులర్ సినిమాలకి ధీటుగా ఈ సినిమా వసూళ్లు వచ్చాయి కూడా. ధోనీ సినిమా జనాలలో అంతగా ఆసక్తిని రేకెత్తించింది మరి. ఇక సచిన్ టెండూల్కర్ క్రీడా జీవితం గురించి సచిన్ – బిలియన్ డ్రీమ్స్ అంటూ కొత్త సినిమా వస్తోంది. టేకింగ్ స్లో గా అవుతోంది, షూటింగ్ లేట్ అయినా లేటెస్ట్ గా ఈ సినిమా రానుంది.

ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్‌కు రంగం సిద్ధం చేశారు.గురువారం రాత్రి 7 గంటలకు ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ రాబోతోంది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో వదిలిన పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సచిన్ కెరీర్లోని రకరకాల ఫొటోలతో పాటు.. అతడి కెరీర్‌ను ప్రభావితం చేసిన అన్ని అంశాల ప్రస్తావన ఇందులో కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here