చనిపోయిన శరీరాన్ని ఎందుకు దహనం చేస్తారో తెలుసా

ప్రకృతి చాలా విచిత్రమైంది. అద్భుతమైంది కూడా. తాను తయారు చేసిన దానిని నాశనం చేసే శక్తి ప్రకృతి సంపాదించుకుంది. మనిషి తయారు చేసినవి తప్ప ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసే ఈ పదార్ధాన్నైనా ఎటువంటి సంక్షోభం లేకుండా తనలోనే కలిపేసుకుంటుంది. దీనికి మానవశరీరం అతీతం కాదు. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం, ఇవే భూమి మీద ఉన్న జీవికోటికి ఆధారం.

వీటినుంచి మానవశరీరం పురుడు పోసుకుంది. అందుకే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దేహాన్ని ప్రకృతిలోనే కలిపేసుకునే పద్దతిని దహనసంస్కారం అంటారు. మనం పుట్టకముందు మనకు సంబంధించినవి ఏవీలేవు.

అలాగే మనం పోయిన తరువాత మనకు సంబంధించినవి ఈ లోకంలో ఉండకూడదనేది ఈ అంశం. దహనం ద్వారా అతని శరీరాన్ని పూర్తిగా దహనం చేయడం దీనివెనుక ఉన్న అర్ధం. ప్రపంచంలోనే నిమిషానికి లెక్కలేనంతమంది పుడుతుంటారు. లెక్కలేనంత మంది పోతుంటారు. మరి శవాన్ని పూడుస్తూ వెళ్లూఉంటే మనుషుల కంటే శవాలు ఉండటానికే చాలా ఎక్కువ స్థలం కావాలి. అందుకే దీన్ని ముందే గమనించిన ప్రాచీన భారతీయులు శరీరదహన పద్దతిని  వెలుగులోకి తెచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here