ఫేస్ బుక్ లో ప్రేమించి 18 మంది అమ్మాయిల బ్లూ ఫిలిం లు తీసాడు

ప్రేమ దోమ అంటూ కహానీలు చెప్పి హ్యాండ్ ఇచ్చే మగాళ్ళు ఆడాళ్ళూ చాలా మంది ఉంటారు కానీ ఈ కుర్రాడు మాత్రం మహా ముదురు అనమాట. ప్రేమ పేరుతో యువతులని ప్రేమించినట్టు నటించడం వారి నగ్న దృశ్యాలు చూపిస్తూ డబ్బు గుంజుకోవడం , వారి ఆభరణాల నుంచి క్రెడిట్ కార్డు వరకూ అన్నీ లాక్కోవడం ఇవన్నీ అలవాటుగా మారిన ఒక యువకుడు ఆఖరికి దొరికాడు. అనేకమందిని మోసం చేసిన సింగం అనిల్ కుమార్ అనే అతను ఒక అమ్మాయిని లోబరచుకుని ఆమెతో పాటు ఒక బ్లూ ఫిలిం తీసాడు.

అది ఫేస్ బుక్ లో పెడతా అంటూ ఆమెని బెదిరించాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఏం చెయ్యాలో తెలియని ఆమె తన తల్లి తండ్రుల సహాయం తో అతనిమీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది .నిందితుడిని పోలీసులు ఏలూరులో అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్ల నుంచి ఈ ప్రబుద్ధుడు ఇదే పనిలో ఉన్నాడట. హైదరాబాద్, విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లోని దాదాపు 18 మంది యువతుల జీవితాలతో ఇదే విధంగా ఆడుకున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here