బాహుబలి క్యూ లైన్ లలో తొక్కిసలాటలు .. ప్రాణాలకి భయం

బాహుబలి – కంక్లూజన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్ ల దగ్గర సినిమా అభిమానులు బారులు తీరిపోయి ఉన్నారు. టికెట్ల విక్రయాలు మొదలు అవ్వడం ఆలస్యం గుంపులు గుంపులుగా జనాలు తొక్కిసలాటల నడుమ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ ఐ మాక్స్ సంగతి చూసుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర ప్రారంభం అయిన క్యూ లైన్ మింట్ కాంపౌండ్ వరకూ సాగడం విశేషం. పోలీసులు ఈ ప్రాంతం లో మాత్రం భారీగా సేఫ్టీ తీసుకుంటూ తొక్కిసలాట జరగకుండా చూసుకుంటున్నారు.

నగరంలోని పీవీఆర్, ఐనాక్స్ తదితర మల్టీప్లెక్సులతో పాటు సత్యం, రామకృష్ణ, దేవి, సుదర్శన్ వంటి సింగల్ థియేటర్ల వద్దా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ప్రతీ ఊరి లో విపరీతమైన క్యూ లైన్ పొడుగులు కనపడుతున్నాయి. రెండు వేలు మూడు వేలు అయినా కూడా టికెట్ డబ్బులకి వెనకాడకుండా జనాలు కొనుక్కుని పోతున్నారు. టికెట్టు కోసం పడిన తొక్కిసలాట లో కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి అనీ గుంటూరు కృష్ణా జిల్లాలో రెండు పెద్ద థియేటర్ ల దగ్గర పోలీసు సెక్యూరిటీ లేకపోవడం తో ఇది జరిగింది అంటున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here