రే మాల్యా..చోర్ సాలే

భారతదేశపు గజదొంగగా పిలిచే  విజయ్ మాల్యాకు అడుగడునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. రూ.9 వేలకోట్లు ఎగగొట్టి భారత్ నుంచి పారిపోయి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే  మాల్యా  క్రికెట్ పై మనసు చంపుకోక ఐసీసీ చాంపియన్ షిప్ మ్యాచ్ లను స్టేడియాలకు వచ్చి వీక్షిస్తున్నాడు. మ్యాచ్ మధ్యలో భారతక్రికెటర్లతో మంతనాలు జరుపుతున్నాడు. ఇన్ని రోజులు ఎలా ఉన్నానిన్న జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ లో భారతీయులు మాల్యాకు చుక్కలు చూపించారు.

దర్జాగా నల్లరంగు ప్యాంట్, నీలివర్ణం బ్లేజర్ లో టిప్ టాప్ గా తయారై ఓవెల్ మైదానానికి తరలివచ్చాడు. అంతే అక్కడ మాల్యాను చూసిన భారతీయులు దొంగ దొంగ అంటూ కేకులు వేశారు. అంతటితో ఆగకుండా రే మాల్యా చోర్ సాలే అంటూ తిట్లదండకం అందుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక. మిన్నకుండిపోయాడు. సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయి మ్యాచ్ ను వీక్షించాడు.  పోలీసులు చేయలేని పనిని భారతీయులు చేస్తున్నారని ఆర్ధిక వేత్తలు మొచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here