అనుష్క‌తో లిప్ లాక్..వ‌ద్దంటున్న ప్ర‌భాస్..?

హీరో ప్ర‌భాస్ కు హీరోయిన్ క‌ష్టాలు ఇప్ప‌ట్లో త‌ప్పేలా లేవు. బాహుబ‌లితో ప్రంప‌చాన్ని త‌న‌వైపుతిప్పుకున్న ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం సాహోలో న‌టిస్తున్నాడు. అయితే రూ.150కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ల‌ను ఎంపిక చేయ‌డం చాలా క‌ష్టంగా మారిందంటున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో హీరోయిన్ లో బోల్డ్ గ్లామ‌ర‌స్ గా  న‌టించాల్సి ఉంది. అందుకే ఈ తిప్ప‌ల‌ని సినీజ‌నాలు గుస‌గుస‌లాడుతున్నారు. ఇందుకోసం ముగ్గురు హీరోయిన్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు  ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అనుష్క, పూజా హెగ్డే, మంజిమా మోహన్‌. ఈ సినిమా హీరోయిన్‌గా అనుష్క పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితమే పూజ పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో కొన్ని బీభ‌త్స‌మైన లిప్ లాక్ సీన్లు ఉండ‌డంతో అనుష్కని ప్ర‌భాస్ వ‌ద్ద‌న్న‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌భాస్ – అనుష్క‌ల పెళ్లి అంటూ వ‌స్తున్న రూమ‌ర్ల‌తో ఇప్పుడు లిప్ లాక్ సీన్ల‌తో ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉన్నందున ప్ర‌భాస్ వ‌ద్దంటున్నాడ‌ట‌. తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగ‌చైత‌న్య‌తో నటించిన మంజిమా మోహన్‌ పేరు వినిపిస్తోంది. సినిమాకోసం ఎటువంటి లిప్ లాక్ సీన్లు, కుర‌చ‌దుస్తువులు ధ‌రించేందుకు సిద్ధమేనని మంజిమ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ప్రభాస్‌ ఎవరికి ఛాన్స్‌ ఇస్తాడో  వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here