జ‌య‌ల‌లిత‌ను చంపేందుకు అన్న కుట్ర చేశాడు : దీపా జ‌య కుమార్

జ‌య‌ల‌లిత మేన‌కోడలు దీపా జ‌య కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌య‌ల‌లిత‌ను హ‌త్య‌చేసేందుకు శ‌శిక‌ళ త‌న అన్న దీప‌క్ కుట్ర‌ప‌న్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని కేసు విచారించాల‌ని కోరారు. పోయెస్ గార్డెన్ లో ఉన్న‌జ‌య‌ల‌లిత చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించేందుకు దీప‌, ఆమె అనుచ‌ర‌గ‌ణం వెళ్ల‌గా , శ‌శిక‌ళ అనుచ‌రులు త‌మ‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని దీపా మండిప‌డ్డారు. శ‌శిక‌ళ నుంచి అన్నాడీఎం కే పార్టీని కాపాడాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌య ఆస్తుల‌న్నీ త‌న‌కే సొంత‌మ‌ని అందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సూచించారు.

జయలలిత ఆస్తికి తానే వారసురాలినని, పోయెస్ గార్డెన్స్ తనకే దక్కుతుందన్నారు. అయితే దీప ఆరోప‌ణ‌ల‌పై స్పందిచంని దీప‌క్..త‌న అత్త ఆస్తుల‌కు తామిద్ద‌రం వారసుల‌మ‌ని అన్నారు. కానీ దీపా ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలియ‌ద‌ని, త్వ‌ర‌లో దీనిపై ప్రెస్ మీట్ లో వెల్ల‌డిస్తాన‌ని తెలిపాడు. శ‌శిక‌ళ‌తో క‌లిసి త‌న అత్త‌ను చంపే అవ‌స‌రం త‌న‌కు లేద‌ని .. తాను దీపతో సహా ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అలాంటప్పుడు శశికళతో కలిసి తాను కుట్ర చేశానని చెప్పడం సరికాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here