ఆ సినిమాకు బాహుబ‌లి2 కాలిగోటితో స‌మానం.

ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ ఎస్. రాజ‌మౌళి తీసి బాహుబ‌లి క్రేజ్ అంతా ఇంతాకాదు. బాహుబ‌లి2లో కూడా అదే హ‌వాను కొన‌సాగిస్తు రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. ఈ చిత్రం విడుద‌లైన 2రోజుల్లో 500కోట్లు వ‌సూలు చేసి ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. దీంతో బాలీవుడ్ షాక్ తిని  ఇంకా కోలుకోలేదు. అయితే ఈ సినిమా బాహుబ‌లి కాలి గోటితో స‌మానామ‌ని  బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ లో  ప్యాటీ జెన్ కిన్స్ లేడి డైర‌క్ష‌న్ లో వండ‌ర్ వుమెన్ అనే చిత్రం విడుద‌లైంది. ఈ చిత్రం 3 రోజుల్లో రూ.1435,  వారంలో రూ.2,700 కోట్లు సాధించింద‌ని విశ్లేషిస్తున్నారు.

బాహుబ‌లిపై అక్కసు వెళ్ల‌గ‌క్కుతూ ఈ వండ‌ర్ వుమెన్ చిత్రంతో పోటీ ప‌డ‌లేక ప్రియాంకా చోప్రా నటించిన ‘బేవాచ్’, ‘ద మమ్మీ’లు రెండో స్థానానికి ప‌డిపోయాయ‌ని అక్క‌డి మీడియా మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. కాగా 2003లో తీసిన ‘మాన్ స్టర్‌’ ,  ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ,  ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్‌ సూపర్‌మ్యాన్’, లో కీరోల్ ప్లేచిన డ‌యానా ‘వండర్‌ వుమన్’లో లేడీ ఓరియంటెడ్ పాత్ర చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here