భార్య వాట్స్ యాప్ మెసేజీ లు చూసిన భర్త .. అతన్ని స్పాట్ లో నరికేసిన భార్య :

కలికాలం అనుకోవాలో జనాలలో మినిమం కామన్ సెన్స్ ఉండడం లేదు అనుకోవాలో కానీ భార్యా భర్తల మధ్యన జరిగే గొడవల్లో అసలు అర్ధం లేని వ్యవహారాలు నడుస్తున్నాయి. జీవితాంతం కష్టం సుఖం లో ఒకరితో ఒకరు ఉంటాం అని ప్రామిస్ చేసుకున్న తరవాత కూడా ఆ మాట తప్పుతున్నారు ఎందరో. ఉత్తర ప్రదేశ్ లో భిలావాలి అనే గ్రామానికి చెందిన నేత్రా పాల్ కి నీతూ సింగ్ తో మూడేళ్ళ క్రితం పెళ్ళయ్యింది. నీతూ కి వేరే అబ్బాయి అంటే మొదటి నుంచీ ఇష్టం అనీ అతన్నే ప్రేమిస్తోంది అనీ నేత్రా పాల్ తెలుసుకున్నాడు. అప్పటి నుంచీ ఇద్దరూ కలిసి ఉండడం లేదు.

ఈ మధ్య ఒక ఫామిలీ ఫంక్షన్ లో కలిసిన వీరిద్దరూ మాట్లాడుకున్నారు అదే టైం లో ఆమె వాట్స్ యాప్ మెసేజీ లు చూసే ప్రయత్నం చేసాడు ఆమె భర్త. ఆమెని పక్కకి తోసేసి మరీ మెసేజీ లు చదవడం మొదలెట్టాడు. నీతూ ఈ దెబ్బతో పిచ్చ కోపం తెచ్చుకుని దగ్గరలోని ఒక కొడవలి తో భర్త నెత్తి మీద నరికేసింది. ఆ సంఘటన తరవాత అక్కడ నుంచి పారిపోయింది ఆమె. అతను ప్రస్తుతం ఆసుపత్రి లో చావు బతుకుల మధ్యన ఉన్నాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here