ఏ ఏం రత్నం కి ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

అప్పట్లో పవన్ కళ్యాణ్ – ఏ ఏం రత్నం కాంబినేషన్ లో సత్యాగ్రహి అనే సినిమాని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. అత్యంత ఘనంగా సినిమా ప్రారంభోత్సవం జరిగినా కూడా అది సెట్స్ ఎక్కకుండానే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత ఏ ఏం రత్నం తో సినిమా చేస్తా అంటూ కొబ్బరి కాయ కూడా కొట్టేసిన పవన్ కళ్యాణ్ ఆయనకి మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు అంటున్నారు. పోయిన సంవత్సరం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తి అవ్వగానే వరసగా మూడు సినిమాలు స్టార్ట్ చేసాడు మూడింటికీ కొబ్బరికాయ కొట్టేసాడు.

అదే వరస లో తమిళ డైరెక్టర్ నేసన్ తో ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది లేదు. దీంతో ఈ సినిమాపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా ని పవన్ అటక ఎక్కించేసి నట్టే అంటున్నారు విశ్లేషకులు.త్రివిక్రమ్ సినిమా తరవాత మైత్రీ మూవీస్ తో చెయ్యడం కోసం కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నాడు అంటున్నారు. పొలిటికల్ కమిట్మెంట్ లు కూడా ఉండడం తో ఏ ఏం రత్నం సినిమా డౌట్ అని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here