ఎక్స్ ప్రెస్ రాజా తో నానీ సినిమా :

ఒక పక్క హిట్ లు కొడుతూ మరొక పక్క జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా వరస సినిమాలు చేస్తున్నాడు హీరో నాని. ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరో నాని త్వరలో నిన్ను కోరి విడుదల కి సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఎంసీఏ’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత నాని చేయబోయే సినిమా కూడా ఖరారైపోయింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సూపర్ హిట్ లు ఇచ్చిన మేర్లపాక గాంధీ తో నానీ సినిమా ఓకే చేసాడు. నిజానికి గాంధీ కి రామ్ చరణ్ తో ఒక కమిట్మెంట్ ఉంది అన్నారు అందరూ కానీ అదే కథ ని నానీ కి ఇచ్చి గ్రీన్ సిగ్నల్ పొందాడు అని తెలుస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here