బ్ర‌హ్మీ ఆస్థులు రూ.320కోట్లా..తేల్చిప‌డేసిన క‌థ‌నం

బ్ర‌హ్మానందం పెద్దగా ప‌రిచ‌యంలేని పేరు. క‌మెడియ‌న్ ఎన్నో కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్న బ్రహ్మ‌కీ ప్ర‌స్తుతానికి గ‌డ్డుకాల‌మే న‌డుస్తుంది. ప‌దుల సంఖ్య‌లో క‌మెడియ‌న్ లు ఎక్కువ‌య్యారు. బ్ర‌హ్మీ పాత్ర త‌గ్గింది. దీనికితోడు రెమ్యున‌రేష‌న్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలతో అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. అయితే ఇన్నిరోజులు బ్ర‌హ్మ‌నందం గురించి, కొడుకులు, సినిమాల గురించి తెలుసుకానీ ఆయ‌న రెమ్యున‌రేష‌న్, ఆస్తిపాస్థుల గురించి ఎక్క‌డా మాట్లాడుకుంది లేదు. ఈనేప‌థ్యంలో బ్ర‌హ్మానంద ఆస్థులు ఇలా ఉన్నాయంటూ ఓ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది.

బాగా డిమాండ్ ఉన్న రోజుల్లో బ్ర‌హ్మీ బాగానే పిండుకున్నాడ‌ని, అలా పెద్ద‌మొత్తంలో ఆస్తులు కూడ‌బెట్టాడ‌ని టాక్. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో, హైద‌రాబాద్, త‌న సొంతూరులో భారీగా ఆస్తులు ఉన్నాయ‌ని ప్ర‌చురించింది. అంతేకాదు ఇప్పుడంటే ఆఫ‌ర్లు లేవు..జ‌మానాలో బ్ర‌హ్మానందం డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అనేంత‌లా పేరు సంపాదించాడు. అయితే అలా ఫేమ్ ను కాపాడుకుంటూ వ‌చ్చిన ఈ హాస్య న‌టుడు మొత్తం ఆస్తులు క‌లిపి రూ. 320కోట్లు ఉన్నట్లు లెక్క‌లు వేసింది. ఫేమ్, ప‌లుకుబ‌డి వీట‌న్నింటితోనే బ్ర‌హ్మీ బాగానే సంపాదించాడ‌ని ఓ ఆంగ్ల ప‌త్రిక తేల్చిప‌డేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here