వెల్లులిలో అద్భుత ఔషద గుణాలు

వెల్లుల్లిని వంటల్లో వేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. అలాంటి వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుంది. ఔషద గుణాలతో శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు. వ్యాధుల్ని దరిచేరకుండా కాపాడుతుంది. డైటింగ్ పేరుతో ఒంట్లో ఉన్న అడ్డమైన గడ్డిని కరిగించుకునేందుకు లక్షల లక్షలు వదిలించుకునే  అవసరం లేకుండా వెల్లులిని తింటే చాలని డాక్టర్లు చెబుతున్నారు. అలా తిన్న వెల్లులి రసం ఒంట్లో పేరుకున్న కొవ్వులోకి చొచ్చుకుపోయి వ్యర్ధాల రూపంలో బయటకు విడుదల చేసేందుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

అంతేకాదు చెవి పోటు, ముక్కు పోటు లాంటి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెపోటు, ధమనుల సమస్యలు, జలుబు, ఫ్లూ, జ్వరం, హై బీపీలను నివారిస్తుంది. అంతేకాదు ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల సహజ యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలు జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here