ఆంజనేయుడ్ని తిట్టుకుంటున్నారు

హనుమాన్ నామస్మరణతో దేశం మొత్తం మారుమోగుతుంటే అక్కడి ప్రజలు మాత్రం ద్వేషిస్తున్నారు. 20వేల సంవత్సరాల నుంచి ఉత్తరాఖండ్ అల్మోరా ద్రోణగిరిలో హనుమంతుడి పేరు చెబతే అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. పొరపాటున ఎవరైనా పిలిచినా, పిల్లలకి హనుమంతుడి పేర్లు పెట్టినా ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా బాధిస్తారు. లేదంటే శిక్షిస్తారు. పురాణాల ప్రకారం రామరావణాసుర యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు.  అతన్ని మేల్కొల్పడానికి హనుమంతుడికి ఒక పనిని అప్పజెప్పాడు రాముడు. సంజీవనీ అనే మొక్కను తీసుకురమ్మని. అది కూడా చాలా త్వరగా తెమ్మని చెప్పాడు. హనుమంతుడు వెనకాముందు చూసుకోలేదు.

మొక్కను తీసుకురావడానికి వెళ్లిపోయాడు. రాముడు చెప్పిన పర్వతం చేరుకున్నాక, హనుమకు సందేహం వచ్చింది. సంజీవని మొక్క ఎలా ఉంటుంది? పర్వతమంతా వెతికాడు. ఎన్నో చెట్లు.. మొక్కలు.. పెద్ద పెద్ద రాళ్లు.. ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియనప్పుడు వాటి మధ్య ఉన్న దానిని ఎలా తీసుకురావడం?! అందుకే పర్వతాన్నే పెకిలించి, మోసుకొచ్చేశాడు. అలా మొసుకురావడమే ఆంజనేయుడి చేసిన తప్పు. హనుమంతుడు తీసుకొచ్చిన ఆ కొండే ద్రోణ గిరి ప్రాంతంలో ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కొండను, అందులో ఉన్న సంజీవని మొక్కను ఆంజనేయుడు తీసుకెళ్లాడు కాబట్టే తమకు అందకుండా పోయిందని కోప్పడుతుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here