బెడ్ రూంలో భార్యభర్తల ఫోటోల్ని తప్పనిసరిగా పెట్టుకోవాలి

బహుశా ఫెంగ్ ష్యూ అనే శాస్త్రం చైనాలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ శాస్త్రం ఆధారంగా చైనా వాసులు వాస్తుని ఫాలో అవుతుంటారు. భవిష్యత్తు బాగుండాలని ప్రకృతికి, మనికిషి అనుసంధానం చేస్తూ 3వేల సంవత్సరాల క్రితం ఫసి అని ముని ఈ గంద్రాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ శాస్త్రాన్ని భారతీయ మేధావులు తూచా తప్పకుండా పాటిస్తారు. వాటిలో మన ఇంట్లో ఎక్కడ ఏ ఫోటోలు ఉంచాలి. ఎలా పడుకోవాలి అనే వాటిపై పరిశోదించి తద్వారా పలుసూచనల్ని అందించింది ఈ శాస్త్రం. ముఖ్యంగా పడక గదిలో అయినా ఆఫీసులో అయినా విద్యుత్ పరికరాలను వీలైనంత దూరంలో ఉంచాలి. ఎందుకంటే వాటిలో ప్రసారమయ్యే విద్యుత్ తరంగాలు మీ పని తీరును ప్రభావితం చేస్తాయి.
దీనివల్ల మీరు సక్రమంగా పని చేయలేరు. అందువల్ల వాటిని తగినంత దూరంలో ఉంచాలని ఈ శాస్త్రం చెపుతోంది. అలాగే గుమ్మంవైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే శవరూపంగా ఉంటుందని ఈ శాస్త్రంపేర్కొంటోంది.పడక గదిలో భార్యా భర్తలు తమ ఫోటోలను విధిగా పెట్టుకోవాలి. దానితో బాతుల జంట వున్న ఫోటోను కలసి పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదంటే  ఎంత డబ్బు అర్జించినా నిలవదు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని ఈ శాస్త్రం చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here