పెట్రోల్ ధరలు తగ్గడం పెరగడం వెనక మతలబు ఇదే

అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక కొలిక్కి వచ్చేలా కనపడ్డం తో మళ్ళీ రేపు చమురు ధరలు తగ్గుతాయి. ఇప్పటికే ఐదు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తున్న కంపెనీలు గత పది హేను రోజుల వ్యవధిలో ధరలను తగ్గిస్తూ రావడమే ఇందుకు కారణం. ఇండియన్ ఆయిల్ కంపెనీ తన వెబ్సైటు లో ఎ విషయం పేర్కొంది. విశాకపట్నం లో ఇవాళ పెట్రోల్ ధర రూ. 70.50 కాగా, డీజిల్ ధర రూ. 60.70. ఇదే సమయంలో హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 72.68, డీజిల్ ధర రూ. 62.53గా ఉంది.

ఇవాళ ప్రకటన చూసి రేపు రెండు రూపాయల వరకూ తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే, ఈ సంవత్సరం జనవరిలో రూ. 75.37గా ఉన్న లీటర్ పెట్రోలు ధర ఐదు నెలల వ్యవధిలో రూ. 5 మేరకు తగ్గినట్టు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here