” రజినీకాంత్ జాగ్రత్తగా ఉండు.. నిన్ను చంపేస్తాం “

పెద్ద హీరో సినిమాలు అంటే చాలు వాటి చుట్టూ ఏదో ఓక రకమైన వివాదం మొదలు అయిపోతుంది అదేంటో. ఎవరూ ఊహించని యాంగిల్స్ బయటకి వచ్చి మరీ దీనికి కూడా వివాదమా అని అనిపించేలా ఉంటాయి స్టోరీ లు. కబాలి డైరెక్టర్ తో రజినీకాంత్ మరొక సినిమాకి సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అండర్ వరల్డ్ డాన్ హాజ్ మస్తాన్ జీవితం మీద తీస్తున్నారు. అతని పాత్రని రజినీకాంత్ చెయ్యబోతున్నాడు . రజినీకాంత్ ఆ సినిమా చేస్తే ఓకే కానీ తన తండ్రి ని విలన్ గా నెగెటివ్ గా చూపిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అని హాజీ మస్తాన్ దత్త పుత్రుడు వార్నింగ్ ఇస్తున్నాడు.

లీగల్ గా నోటీసు కూడా పంపించడం విశేషం.  మామూలుగా రజినీ వివాదాలంటే భయపడతాడు. జాగ్రత్తలు పాటిస్తాడు. మరి నిజంగానే హాజీ మస్తాన్ స్ఫూర్తితో కథను అల్లుకుని ఉంటే మార్పులేమైనా చేస్తారేమో చూడాలి. మనకి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రజని కి హాజీ మస్తాన్ కొడుకు నుంచి వార్నింగ్ కాల్ కూడా వచ్చింది అనీ ఈ సినిమా లో తన తండ్రి పాత్ర తేడాగా ఉంటె నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని రజిని ని అతను బెదిరించాడు అని సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here