ఫోన్ లో తలాక్ మేసేజ్ పంపించాడు .. ఇదెక్కడి విడ్డూరం

ట్రిపుల్ తలాక్ విషయం లో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కానీ తలాక్ ల విషయం లో జరగాల్సిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అత్తింటి వారు కట్నం సరిగ్గా ఇవ్వడం లేదు అనే ఉద్దేశ్యం తో భార్య కి మూడు సార్లు తలాక్ చెప్పాడు భర్త అది కూడా ఫోన్ లో చెప్పేసాడు. మీరట్ కి చెందిన సల్మా ని ఆజాద్ అనే వ్యక్తికి ఇచ్చి గతేడాది పెళ్లి చేసారు.  ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆజాద్ ట్రిపుల్ తలాక్ అంటూ సల్మా తండ్రికి ఫోన్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు.

‘‘మై ఆప్ భేటీ సల్మా తో తలాక్, తలాక్, తలాక్ దేతా హు, ఉస్ కే సాత్ రెహ్‌నా హరామ్ హై’’ అని అందులో పేర్కొన్నాడు. సల్మా ఈ మెసేజ్ చదవగానే కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం ఉంది అంటూ పెళ్లి చేసుకున్నాడు అనీ 15 లక్షలు కట్నంగా తీసుకున్నాడు కూడా అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here