పవన్ కళ్యాణ్ మరొకటి .. త్రివిక్రమ్ ఐడియానే..

ఈ సంవత్సరం బాలీవుడ్ లో అనూహ్యంగా హిట్ అయిన సినిమా జాలీ ఎల్లెల్బీ 2 . అక్షయ్ కుమార్ హీరో అయిన ఈ సినిమా విమర్శకుల ప్రసంసలు కూడా బాగానే అందుకుంది. సుభాష్ కపూర్ డైరెక్షన్ లో మంచి వసూళ్లు కూడా సాధించిన ఈ చిత్రం. హక్కులని విక్టరీ వెంకటేష్ కోసం కొన్నారు అని టాక్ నడిచింది. కానీ ఈ సినిమా హక్కులు వెంకటేష్ కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం కొన్నారు అంటున్నారు. త్రివిక్రమ్ స్వయంగా ఈ సినిమా చూసి తెలుగు లో పవన్ తీస్తే బాగుంటుంది అని అన్నాడట.

‘లవ్ ఆజ్ కల్’ను ‘తీన్ మార్’గా తెలుగులోకి మార్చడంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్.. ‘జాలీ ఎల్ఎల్బీ-2’ రీమేక్‌కు కూడా తన సహకారం అందిస్తాడని సమాచారం. స్క్రిప్ట్ లో మార్పుల విషయం లో పూర్తి సహకారం అందిస్తా అంటూ మాట కూడా ఇచ్చాడు అంటున్నారు . ఫాన్స్ మాత్రం రీమేక్ పేరు చెప్తే పిచ్చ సీరియస్ అయిపోతున్నారు. గోపాల గోపాల , కాటమరాయుడు లాంటి రిజల్ట్ ల తరవాత పవన్ ఫాన్స్ కి రీమేక్స్ వద్దు అనే ఉద్దేశ్యమే ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here