సీరియల్ ని అనుకరించి చనిపోయాడు ఆ చిన్న పిల్లాడు ..

చిన్న‌పిల్ల‌లపై సీరియ‌ళ్ల ప్ర‌భావం విప‌రీతంగా ఉంటుంది. అందులో వ‌చ్చే స‌న్నివేశాల‌ను అనుక‌రించ‌డానికి వారు చాలా ఆస‌క్తి చూపిస్తారు. ఇలాంటివి ఇంట్లో ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని ఆయా సీరియ‌ళ్ల టైటిల్స్ లో హెచ్చ‌రిక‌లు వేస్తున్నప్పటికీ, వారు వినిపించుకోరు. రెండు నెల‌ల క్రితం ఓ బాలిక, సీరియ‌ళ్ల ప్ర‌భావంతో త‌న‌ను తాను ద‌హించివేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల బాలుడు సీరియ‌ల్‌లో పాత్ర‌ను అనుక‌రించ‌బోయి ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల రంజిత్ `మ‌హాకాళి` సీరియ‌ల్‌లో ఓ స‌న్నివేశాన్ని అనుక‌రించి చూపిస్తాన‌ని త‌న చెల్లి గుంజ‌న్‌, మ‌రో స్నేహితుడితో చెప్పాడు. ఆ స‌న్నివేశంలో అమ్మ‌వారి నాలుక బ‌య‌టికి వ‌చ్చి ఉంటుంది. అలా త‌న నాలుక కూడా వీలైనంత మేర బ‌య‌టికి తీయ‌డం కోసం చున్నీని మెడ‌కు చుట్టుకున్నాడు. దీంతో ఉరి ప‌డి, ఊపిరాడ‌క గిలగిల కొట్టుకున్నాడు. అక్క‌డే ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లూ బ‌య‌టికి వెళ్లి పెద్ద‌వాళ్ల‌కు చెప్పి, వాళ్లు సంఘ‌ట‌న స్థలానికి వ‌చ్చేస‌రికే రంజిత్ ప్రాణాలు కోల్పోయాడు. గ‌తంలో కూడా రంజిత్ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌బోయాడ‌ని, అప్పుడు అత‌ని త‌ల్లి గ్ర‌హించి ఆపిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here