కొత్త ఆనవాయితీ మొదలు పెట్టన హీరో అల్లూ అర్జన్

టాలీవుడ్లో ఆడియో వేడుకలు జరుపుకునే రోజులు ఎప్పుడో అంతరించి పోయింది…. ఈ క్రమంలో  సినిమాల ప్రమోషన్ సంబంధించి రకరకాల ఈవెంట్లు వెలుగులోకి వచ్చాయి. సినిమా టైటిల్ అంటూ, టీజర్ అంటూ, ఫస్ట్ లుక్ అంటూ ఇలా రకరకాలుగా తమ సినిమానినిర్మాతలు ఈ విధంగాప్రమోషన్ చేస్తున్నారు. అప్పట్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన “పైసా వసూల్” సినిమా ప్రమోషన్లో భాగంగా టిజర్ కన్నా ఎక్కువ, మరోవైపు ట్రైలర్ కన్నా తక్కువ అన్నా రీతిలో స్టంపర్ అంటూ టిజర్ వంటిదాన్ని విడుదల చేశాడు.
ప్రస్తుతం ఇదే పంథాలో అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అనే సినిమాను చేస్తున్నాడు… ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది… ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తోంది… దీనిలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్  రానుందని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో అందరు ఫస్ట్ఇంపాక్ట్ అంటే ఏమిటి ? అని ఆలోచనలో పడ్డారు.
ఇంతకి ఇంపాక్ట్  అంటే ఎలాంటి డైలాగ్స్ లేకుండా హీరోని (అల్లు అర్జున్ ) లుక్ ని చూపించడం.అప్పట్లో పైసా వసూల్ సినిమా యూనిట్ స్టంపర్ అనే పదం ఉపయోగించి చేసిన ప్రయోగం అంతగా జనాల్లోకి  వేలలేకపోయింది.మరి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తో మొదలుకానున్న ఈ ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఈ సినిమా సక్సెస్ అయితే అదికూడా ఒక మంచి ఆనవాయితీగా మారడం ఖాయమని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here