కేవలం పదికోట్ల లో త్రివిక్రమ్ కొత్త సినిమా ? ఇదొక పెద్ద ప్రయోగం !

హీరో విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అద్భుతమైనది డైలాగులు పరంగా టైమింగ్ పరంగా అలాగే పంచులు వీరిద్దరి కలయికలో అప్పట్లో వెండితెర మీద అద్భుతంగా పేలాయి. మాలి  చాలా సంవత్సరాలకు వీరిద్దరూ కలయికలో సినిమా రాబోతుంది అన్న వార్త విని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆనందించారు… అంతలోనే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ న్యూస్ వచ్చింది అదేంటంటే త్రివిక్రమ్ వెంకటేష్ తీయబోయే సినిమా బాలీవుడ్ హీరోఅక్షయ్కుమార్ నటించిన  జాలీ ఎల్ ఎల్ బీ 2’ రీమేక్ అని విని  సినీ జనాలు షాక్కు గురయ్యారు.

కారణం జాలీ ఎల్ ఎల్ బీ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే పార్ట్ 2 ఏమంత మెప్పించ‌లేదు.సినిమా కథ పరంగా జాలీ ఎల్ ఎల్ బీ 2 లో పెద్ద స్టఫ్ కూడా ఏమి లేదు,కామెడీ కూడా తక్కువే సినిమాలో.ఇప్పుడు అందరికి ఒకటే షాక్ ఏంటి అంటే పోయి పోయి త్రివిక్రమ్ ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకున్నట్ల్లో ఎవరికి అర్ధం కావడం లేదు.పైగా ఈ సినిమాను రైట్స్ హారిక హాసిని ద‌గ్గ‌ర ఉన్నాయి.ఈ సినిమాని చాలా త‌క్కువ టైమ్‌లో, త‌క్కువ బ‌డ్జెట్ లో తీసేయొచ్చు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొనే ఈ ప్రాజెక్టుని ఓకే చేశార‌ని తెలుస్తోంది.

పైగా రీమేక్ సినిమాలంటే హీరో వెంకటేష్ కుఎంతో ఇష్టపడి పనిచేస్తాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలోఅజ్ఞాతవాసి,ఎన్టీఆర్ సినిమాఉన్నాయి…ఈ పూర్తవగానే వెంకీతో తీయబోయే  సినిమాపట్టా లెక్కుతోంది ఈలోగా త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌లు మారే అవ‌కాశాలున్నాయి. వెంకీతో ఎప్పుడు సినిమా చేసినా… త‌క్కువ బ‌డ్జెట్‌లో అంటే.. పారితోషికాల‌న్నీ మిన‌హాయించుకుని రూ.10 కోట్ల‌లోపు సినిమా పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో నిర్మాత ఉన్న‌ట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here