అల్లూ శిరీష్ పాస్ ఐపోయాడు .. ఇకా సునీల్ మిగిలాడు మరి !

తెలుగు చలనచిత్ర పరిశ్రమ 2017సంవత్సరం రెండు సినిమాలతో ముగింపు పలకనుంది ఈ క్రమంలో ఆ రెండు చిత్రాలు ఏమిటంటే ‘ఒక్క క్ష‌ణం’,‘2 కంట్రీస్‌’ .ఇందులో మొదటిది “ఒక క్షణం” ఇవాళ విడుదల అవ్వగా, రెండవది ‘2 కంట్రీస్‌’ శుక్రవారం విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రేక్షకులకు రెండు సినిమాల ఫలితాల పై ఆసక్తి నెలకొంది. నిర్మాణపరంగాఈ రెండు సినిమాలు మాదిరికరమైన బడ్జెట్ తో తెరకెక్కినయి. ఈ  సినిమాలు రికార్డులు సృష్టించే దిశగా లేకపోయిన కొంత ఆసక్తి మాత్రం సగటు ప్రేక్షకుడుకు ఉంది.

రెండు సినిమాల్లో పోలిస్తే ఒక్కక్షణం మీద ప్రేక్ష‌కులు కాస్త మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయి.దీనికి కారణం డైరెక్టర్  విఐ ఆనంద్ పని తనం ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా.అంతేకాకుండాఅల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా హిట్ తో మంచి జోరుమీదున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి అల్లు అర్జున్ రావ‌డంతో  సినిమా మీద ప్రేక్షకులకు కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒక్క క్షణం సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉండనే ఉంది.

మరోవైపు  ‘ఒక్క క్ష‌ణం’ తో పాటు ‘2 కంట్రీస్‌’ కూడా విడుద‌ల‌కు సిద్దం అవుతోంది….సరైన హిట్లు లేక చతికిల పడుతున్నసునీల్ ఈసారి మలయాళ రీమేక్ గా ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నాడు . ఈ సినిమా హడావిడి బయట అంతగా కనబడకపోయినా హీరో సునీల్ బట్టి వెళ్లే ప్రేక్షకులు ఉండడంతో అక్క‌డ ‘ఒక్క క్ష‌ణం’తో పోలిస్తే సునీల్ సినిమాకే ఎక్కువ టికెట్లు తెగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ‘ఎంసీఏ’ త‌న జోరు రెండో వారం చూపించేట‌ట్టే క‌నిపిస్తోంది. ‘ఒక్క క్ష‌ణం’, ‘2 కంట్రీస్’ క‌ల‌సి క‌ట్టుగా నిల‌బ‌డితే త‌ప్ప మిడిల్ క్లాస్ అబ్బాయికి స్పీడు బ్రేక‌ర్లు ప‌డ‌వు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here