బావ ని చంపేసింది .. కాలవలో విసిరేసింది

త‌న‌ను వేధిస్తున్నాడ‌ని ఓ మ‌హిళ త‌న‌ బావ‌ను హ‌త్య‌చేసి కాలువ‌లో ప‌డేసిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా క‌నపడ‌కుండా పోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కోసం గాలిస్తోన్న పోలీసులు చివ‌ర‌కు ఈ కేసును ఛేదించి అస‌లు విష‌యాన్ని తేల్చారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి సుభాష్ అదృశ్య‌ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు ఆయ‌న మ‌ర‌ద‌లు సునీతపై అనుమానం క‌లిగింది.
ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను విచారించగా నిజం చెప్పింది. తన ఇంటికి త‌న బావ ప‌దే ప‌దే వ‌చ్చి లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. అందుకే అతడికి విషమిచ్చి హ‌త్య చేసి, మృత‌దేహాన్ని కాలువ‌లో ప‌డేసిన‌ట్లు చెప్పింది. ఆ మృత‌దేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here