అఖిల్ లో కాన్ఫిడెన్స్ అన్నా పెంచింది ..

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రమైన హలో సినిమా అఖిల్ మొదటి చిత్రం అఖిల్ తో  పోలిస్తే చాలా అద్భుతంగా వచ్చింది,నటన పరంగాఅఖిల్ మొదటి చిత్రం కంటేరెండో చిత్రంలోవేరియేషన్స్ చూపించాడు.క్వాలిటీ పరంగా,మేకింగ్ పరంగా ఇలా అన్ని విషయాలలో హలో అందరినీ మెప్పించింది. హలో ,ఎంసీఏ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి..ఎంసీఏ కంటే హలో సినిమా కు రేటింగ్ లు బాగా వచ్చాయి. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే హలో కూడా  నష్ట పోక తప్పదు.

దాదాపుగా రూ.15 నుంచి రూ.20 కోట్ల వ‌ర‌కూ `హ‌లో` న‌ష్ట‌పోయే ఛాన్సుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి.ఇదే విష‌యాన్ని పాత్రికేయులు ప్ర‌స్తావిస్తే.. ”నా కొడుకు సినిమా…. అందుకే ఖ‌ర్చు పెట్టాను” అని సంతోషంగా చెప్పాడు. ఈ చిత్రానికి దాదాపు 40 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టాడు నాగార్జున‌.కాక‌పోతే ఒక‌టి.. అఖిల్‌కి న‌టుడిగా మంచి మార్కులు ప‌డ్డాయి. దానికి తోడు ‘హ‌లో’ తో అఖిల్ లో కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ కూడా పెరిగాయి. త‌దుపరి సినిమాల బ‌డ్జెట్ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త ప‌డితే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here