పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని కంట్రోల్ చెయ్యాల్సిన బాధ్యత బన్నీ దే ..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఫాన్స్ కి వార్ ‘చెప్పను బ్రదర్’ అన్నా టైం నుండి స్టార్ట్ అయింది.ఈ క్రమంలో  అల్లు అర్జున్ ఏ  ఆడియో ఫంక్షన్ కు  వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మాట్లాడే టైం లో  గొల  గోల చేస్తున్నారు,దీంతో అల్లు అర్జున్ చాలా ఈవెంట్లకు వెళ్లడానికి సంకోచించాడు.

అల్లు అర్జున్కు Pawan kalyan అభిమానుల సెగ గట్టిగానే తగిలింది….చాలా రోజుల తర్వాత తన తమ్ముడు అల్లు శిరీష్ నటించినఒక్కక్షణం ప్రీరిలీజ్ ఫంక్షన్ కి హాజరైన వారు ఎవరు మాట్లాడినా ఫ్యాన్స్ గోల గోల చేయడంతో  వేదిక ఎక్కిన వారు సరిగా మాట్లాడలేకపోయారుఈ క్రమంలో బన్నీ మైక్ పట్టుకుని ఫ్యాన్స్‌కి క్లాస్ పీకేంత వ‌ర‌కూ వెళ్లింది.ప్రీ రిలీజ్‌కి రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. వ‌స్తే… ఇదిగో ఇలా ర‌చ్చ ర‌చ్చ చేశారు.

బ‌న్నీ ఎక్క‌డ‌కు వెళ్లినా.. ఈ త‌ర‌హా టార్చ‌ర్ త‌ప్పేట్టు లేదు. అలాగ‌ని ప్ర‌మోష‌న్ల‌కు రాకుండా, ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో పాల్గొన‌కుండా ఉండాలంటే క‌ష్టం. పైగా త‌న సినిమా వ‌స్తోందంటే విరివిగా… రావాల్సిందే. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకొని, ప‌వ‌న్ అభిమానుల్ని కామ్ చేయ‌డానికి బ‌న్నీ ఏదో ఓ స్టెప్ తీసుకోవాల్సిందే. ఈ క‌థ‌కి శుభం కార్డు వేయ‌డం ఇప్పుడు బ‌న్నీ చేతుల్లోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here