మళ్ళీ అలాంటి తప్పు చెయ్యను – సునీల్

తెలుగు చలనచిత్రరంగంలో హాస్యనటుడిగా ఎంతోమంది మన్ననలు అందుకున్న సునీల్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన రోజులలో అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, పూల రంగ‌డు వంటి రూపాలలో హిట్లు అందుకున్న సునీల్ ,, ప్రస్తుతం హిట్టులేక హిట్టు కోసం తెగ కష్టపడుతున్నాడు.ఆ మధ్యలోకొన్ని యాక్షన్ కథా చిత్రాలతో ప్రేక్షకులను  పలకరించినా మెప్పించలేకపోయాడు.

ఈ క్రమంలో తనకు తగ్గ జోనర్లో అనగా కామెడీ కథ తరహాలో కథలు ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు.ఈ క్రమంలో నెలరోజులుగా సునీల్ దాదాపు 25 కథలు విన్నాడట  .అవన్నీ యాక్షన్ ఎక్కువగా  ఉన్న సినిమాలే… ప్రస్తుతం వాటన్నిటిని పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో కామెడీగానే ప్రేక్షకులను మెప్పించాలని అలాంటి కథలు ఎంచుకుంట అని తేల్చేశాడు. నా బలం కామెడీ దాన్ని వదులుకొని పూర్తి ఆక్షన్ చిత్రాలు చేసే ఆలోచన లేదు భవిష్యత్తులో కూడా అలాంటి ఎక్స్ పరిమెంట్ చేయను అని చెప్పుకొచ్చాడు సునీల్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here