అజ్ఞాత వాసి లో వెంకటేష్ మాకొద్దు బాబోయ్ అంటున్నఫాన్స్ ?

తెలుగు ఇండస్ట్రీ చూపు మొత్తం ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం మిధ ఉంది.అజ్ఞాతవాసి సినిమాకిఅనేకమైన ప్రత్యేకతను సంతరించుకుంది.ఒకపక్కఈ సినిమాహీరో పవన్ కళ్యాణ్ కు 25వ చిత్రం కాగా..మరోపక్కత్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలయికలో మూడవ చిత్రం.ఎలాగైనా హట్రిక్  కొట్టాలనే ఆశతో ఉన్నారు.మరోపక్కఇటీవల విడుదలైన పాటలు,టిజర్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన ఒక పాట నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసి సినిమా విడుదలకు  వారంరోజుల ముందు ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం.

అలాగే ఈ సినిమాలో వెంకటేష్,ఖుష్బూ కూడా నటిస్తున్నారు…ఇక్కడ గమతైన విషయం ఏమిటి అంటే వెంకటేష్ నటించిన మొదటి చిత్రం’ కలియుగ పాండవులు’ లో వెంకటేష్ కుష్బూ జంటగా నటించారు . ఈ సినిమాలో వారిద్దరూ కనపడ్డడం మరో విశేషం.మరోవైపు హీరో వెంకటేష్ కు నువ్వునాకు నచ్చావ్ ,మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ మరోసారి ఈ సినిమాలో కనబడడం అదనపు ఆకర్షణ. ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమాలో వెంకీ కథను కీలకమైన మలుపు తిప్పే పాత్ర చేయనున్నాడు.

ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు కూడా వెంకటేష్ పూర్తిచేశాడట. సినిమాలో నాలుగైదు నిమిషాల పాటు కనబడే వెంకీ  పాత్ర నాలుగైదు నిమిషాలుక్షే త్రివిక్రమ్ శ్రీనివాస్అద్భుతమైన డైలాగ్స్ రాశాడని సమాచారం. వెంకీ పాత్రతో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని కలిపేలా సీన్స్  ఉంటాయని తెలుస్తోంది. అయితే పవన్ ఫాన్స్ మాత్రం వేరేగా మాట్లాడుతున్నారు. గోపాల గోపాల తో ప్లాప్ సెంటిమెంట్ ఉన్న వెంకటేష్ తో కామియో లేకపోతేనే తమకి ఇష్టం అనీ, అసలే హిట్ వచ్చి ఐదేళ్ళు అవుతోంది అనీ ఈ టైం లో నెగెటివ్ సెంటిమెంట్ మాకొద్దు బాబోయ్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here