పంజాబ్ – పూణే కి రసవత్తరమైన మ్యాచ్ ఇవాళ

ఐపీఎల్ లో ఆఖరి ఘట్టం ఓపెన్ అయ్యే ముందర అసలు సిసలైన మ్యాచ్ రాబోతోంది. ముంబై – హైదరాబాద్ , కలకత్తా లు ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోగా ఇప్పుడు నాల్గవ స్థానం కోసం పూణే – పంజాబ్ మధ్యన మ్యాచ్ రసవత్తరంగా సాగ బోతోంది. మొన్న మ్యాచ్ లో పూణే ఓడిపోవడం తో ఈ మ్యాచ్లో వారు గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. పుణె జట్టు 16 పాయింట్లతో మైనస్ 0.083 రన్ రేటుతో ఉండగా, పంజాబ్ జట్టు 14 పాయింట్లతో, పుణెకన్నా మెరుగైన స్థితిలో 0.296 నెట్ రన్ రేటుతో ఉంది.

పంజాబ్ గెలిస్తే రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్స్ కి చేరుతుంది .. పూనే గెలిస్తే 18 పాయింట్ లతో వెళుతుంది.  ఇక నేడు జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనుండగా, ఇరు జట్లూ ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో విఫలమైనందున ఈ మ్యాచ్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here