అభిమాని కారణంగా హీరో విజయ్ జైలు కి ?

హీరోలని ఆకాశానికి ఎత్తేయ్యాలి అన్నా పాతాళానికి తోక్కేయ్యాలి అన్నా అన్నిటికీ అభిమానులే కావాలి . వారు లేకపోతే నెగెటివ్ ఉండదు పాజిటివ్ ఉండదు . విజయ్ లాంటి తమిళ టాప్ హీరోకి అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ రాష్ట్రం లో రజినీకాంత్ తరవాత అంతటి ఫాలోయింగ్ విజయ్ కీ అజిత్ కీ మాత్రమె ఉన్నది. కానీ ప్రస్తుతం తమిళ విజయ్ అదే అభిమానం కారణంగా ఒక పెద్ద వివాదం లో చిక్కుకున్నాడు. త్రిశూలం తో విజయ్ ఫోటోని ఎవరో ఫాన్ చక్కగా మార్ఫ్ చేసి పడేసాడు ఆ ఫోటో లో విజయ్ కాళ్ళకి బూట్లు వేసుకుని ఉండడమే వచ్చింది అసలు చిక్కు.

హిందూ మక్కల్ మున్నని పార్టీ దీనిపై మండిపడింది. షూలు ధరించి త్రిశూలం చేతపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ విజయ్ మీద పోలీసు కేసు పెట్టింది. ఈ ఫోటోతో విజయ్ కి సంబంధమే లేదు పాపం. కానీ కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు పోలీసులు . తేడా వస్తే విజయ్ జైలుకే అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here