రామ్ గోపాల్ వర్మా .. నీకు అసలు సిగ్గుందా ?

రామ్ గోపాల్ వర్మ కీ నేషనల్ మీడియా కీ ఉన్న గొడవ ఈనాటిది కాదు. మిగితా జనాల లాగా మీడియా తో వర్మ ఆచి తూచి మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి కాదు. టీవీ స్టూడియో లో కూర్చుని మీది వేస్ట్ ఛానల్ అంటూ గాలి తీసి పడేస్తాడు వర్మ. అలా చాలాసార్లు నేషనల్ మీడియా ని ఆడేసుకున్నాడు కూడా. అప్పట్లో ముంబయి దాడులు జరిగినపుడు మహారాష్ట్ర సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ వెంట వర్మ వెళ్లడం మీద తీవ్ర దుమారం రేపే కథనాలు ప్రసారం చేసింది.

మీడియా కి ఎగైనెస్ట్ గా రణ్ సినిమా తీస్తి వాళ్ళ దుమ్ము దులిపెసాడు అప్పట్లోనే. వర్మ కెరీర్ లో ఒక మంచి సినిమాగా రణ్ మిగిలిపోతుంది అని చెప్పచ్చు. అప్పటి నుంచీ వర్మ మీద రివెంజ్ కోసం నేషనల్ మీడియా ఎదురు చూస్తున్నా వర్మ ఎక్కడా దొరకడం లేదు. ప్రస్తుతం వచ్చిన సర్కార్ 3 సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడం తో ఇక మీడియా వర్మ ని ఏకడం మొదలు పెట్టింది. నిన్న మార్నింగ్ షో పడ్డప్పటి నుంచి నేషనల్ పత్రికలకు సంబంధించిన వెబ్ సైట్లు.. అలాగే టీవీ ఛానెళ్లలో ‘సర్కార్-3’ ఆడేసుకుంటున్నారు. సిగ్గుందా వర్మా ఎన్నాళ్ళు అవే తీస్తావ్ అంటూ హెడ్డింగ్ లు పెట్టి మరీ ప్రోగ్రాం లు చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here