తెలుగు వాడు తొడకొట్టాల్సిన సమయం ఇది

బాహుబలి రికార్డులు బద్దలు అయిపోయాయి అని మనం రోజూ ఏదో ఒక సందర్భం లో న్యూస్ లో చదువుతూనే ఉన్నాం. అన్ని వెర్షన్ లలో స్పెషల్ రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇండియన్ పనోరమా లో ఒక భారీ రికార్డ్ ని స్థాపించి పడేసింది. హిందీ వెర్షన్ లో అది కూడా డైరెక్ట్ సినిమా కాకుండా డబ్ వెర్షన్ కి విపరీతమైన కలక్షన్ లు రావడం అంటే తెలుగు వారు ఎవ్వరినా సరే తొడ గోట్టాల్సిందే . బాహుబలి అనేక రికార్డులు నెలకొల్పింది కానీ ఈ రికార్డు మాత్రం తిరగారాయలేనిది.

ఎందుకంటే బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ వల్ల కూడా కాని ఫీట్‌ని, అక్కడి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు కూడా సాధించలేకపోయిన ఘనతని బాహుబలి సొంతం చేసుకుంది.కేవలం హిందీ వెర్షన్ కే ఐదొందల కోట్లు లాగేసింది అంటే భారతీయ సినిమాకి ఈ చిత్రం తలమానికంగా మారింది అన్నమాట. మొదటి భాగం తోనే రికార్డులు కుదిపేసిన బాహుబలి బృందం రెండో భాగం తో ఆనవాళ్ళు కూడా లేకుండా రికార్డులు తుడిచి పెట్టేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here