చిరంజీవి కి అంత సీన్ లేదు రా బాబూ అంటున్నారు

తెలుగు మార్కెట్ నే కాకుండా తమిళ , మలయాళం , హిందీ బాషలలో మార్కెట్ ని కూడా బాహుబలి దున్నేసింది. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగితావారు కూడా నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. రాజమౌళి, శంకర్‌, రజనీకాంత్‌కి తప్ప సౌత్‌ నుంచి వెళ్లి హిందీ మార్కెట్‌ని ట్యాప్‌ చేసే సత్తా ఎంతమందికి వుంది? రాజమౌళి  , బాహుబలి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ప్రభాస్ ఇప్పుడు సోలోగా ‘సాహో’తో నేషనల్ లో  ప్లాన్‌ చేసుకుంటున్నాడు. మహేష్ బాబు కూడా స్పైడర్ సినిమా తో బాలీవుడ్ మార్కెట్ లో అడుగు పెట్ట బోతున్నాడు.

మురుగదాస్ కి అక్కడ పేరుంది కాబట్టి పరవాలేదు నడుస్తుంది. ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గా రాబోతున్న చిరంజీవి ఈ సినిమాని నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేసి తీరాల్సిందే అని ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవికి హిందీలో స్ట్రెయిట్‌ సినిమాలు చేసిన హిస్టరీ వుంది. అయితే ఆయన అక్కడ తెలుగులో మాదిరిగా సక్సెస్‌ అవలేదు. బాహుబలి ని చూసి వాతలు పెట్టుకోవడం తప్ప చిరంజీవి అక్కడికి వెళ్లి పొడిచేది ఏమీ లేదు అంటున్నారు విమర్శకులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here