నిశిత్ చనిపోయిన చోట మరొక యాక్సిడెంట్ .. షాకింగ్

ఏపీ మునిసిపల్ మినిస్టర్ నారాయణ కొడుకు నిశిత్ యాక్సిడెంట్ అయ్యి మరణించిన అదే ప్రాంతం లో మరొక యాక్సిడెంట్ జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన ఒక యువతి ఆ పిల్లర్ తో పాటు మరొక కారు ని అదే ప్రాంతం లో గుద్దేసింది.  హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14కు చెందిన రాము అనే వ్యక్తి, తన కారులో మాదాపూర్‌ కు బయలు దేరి, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36కు రాగా రాంగ్ రూట్ లో వచ్చిన ఒకమ్మాయి ఈ కారుని గట్టిగా గుద్దింది .

దాంతో రెండు కార్లూ డ్యామేజ్ అయ్యాయి. పెద్ద శబ్దం కూడా రావడం తో అక్కడివారు పరుగు పరుగున వచ్చారు. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న యువతి కారును అక్కడే వదిలి పారిపోయింది. వెంటనే అదే ప్రాంతం లో యాక్సిడెంట్ అని ఫోన్ రాగానే పోలీసులు మీడియా హడావిడిగా అక్కడికి చేరుకున్నారు. ప్రాణనష్టం లేకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here