ఏడు రోజులు ఏడు వేల కిలోమీటర్లు ముప్పై మీటింగ్ లు

అగ్రరాజ్యం పర్యటన లో ఫుల్ బిజీ బిజీ గా గడిపి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు . ఈ నెల 3 న డిల్లీ వెళ్ళిన ఆయన కేంద్ర మంత్రులతో రాష్ట్రం లోని అభివృద్ధి గురించి వాటి కార్యక్రమాల గురించీ చర్చించారు. తరవాతి రోజు అంటే నాల్గవ తేదీ న డిల్లీ లో బయలుదేరి కాలిఫోర్నియా లో అడుగు పెట్టారు దాదాపు ఏడు రోజుల పాటు అంటే 11 వ తేదీ వరకూ ఆయన మొత్తం 15 నగరాలు పర్యటించారు. అమెరికాలోనే 7000 కిలోమీటర్ల ప్రయాణం చేశారు.
30కి పైగా సమావేశాల్లో పాల్గొని, 90కి పైగా సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు పదమూడు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకునట్టు చెబుతున్నారు. వ్యవసాయం, ఆటోమోటివ్‌, హెల్త్‌ కేర్‌, ఫిన్‌ టెక్‌ రంగాల్లో పెట్టుబడులు కోరినట్టు సమాచారం ఉంది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశ్రమలు పెడితే ఏ మేరకు రాయతీలు ఇస్తాం అనేది చెప్పుకొచ్చారు ఆయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here