ఆ ఇంటిని 10 నిమిషాల్లో ప్యాక్ చేయచ్చు!

ఇల్లు క‌ట్టి చూడు…పెళ్లి చేసి చూడు… అన్నారు పెద్ద‌లు. ఇల్లు క‌ట్టాల‌నేది ఓ మ‌హా ప్ర‌హ‌సనం. అష్ట క‌ష్టాలు ప‌డి మ‌న‌కు కావ‌సిన విధంగా ఇల్లు క‌ట్టుకుంటాం. ఒక‌వేళ‌, ఆ ఇంటిని వ‌దిలి మ‌నం వేరే చోటికి వెళ్లాల్సి వ‌స్తే మ‌నం ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. అటువంటి సంద‌ర్భంలో, ఎంచ‌క్కా మ‌న ఇంటిని మ‌డిచి పెట్టి వేరే చోటికి తీసుకెళ్లే వెసులుబాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది క‌దూ? కొంద‌రు ఔత్సాహికులు ఇలాంటి వినూత్న ఆలోచ‌న‌లకు ఆచ‌ర‌ణ రూపం ఇచ్చారు.

లండ‌న్ కు చెందిన టెన్ ఫోల్డ్ సంస్థ వారికి ఓ వినూత్న ఆలోచ‌న వ‌చ్చింది. ఒక ఇంటిని 10 నిమిషాల్లో  ఫోల్డ్ చేసేసి వేరే చోటికి త‌ర‌లించేట్లుగా రూపొందించారు. ఈ సంస్థ‌వారు ఒక‌ ఇంటిని చుట్టేసి, మరో ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్క‌డ‌ ఒకే ఒక స్విచ్ నొక్క‌గానే ఇల్లు దానంత‌ట అదే ఓపెన్ అవుతుంది. ఫోల్డ‌బుల్ స్ట్రక్చర్స్ పేరుతో ఈ సరికొత్త మూవింగ్ కట్టడాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఫోల్డ‌బుల్ ఇళ్ల‌ను ఎప్పుడు కావాలంటే అపుడు ముడిచేసుకోవ‌చ్చు. వీటిని చాలా సులువుగా వేరే చోటికి త‌ర‌లించవ‌చ్చు.

ఈ త‌ర‌హా ఇళ్లు కొంచెం కాస్ట్లీనే. ఒక ఇంటి ధ‌ర సుమారు 1 లక్షా 29వేల డాల‌ర్లు. అయితేనేం, ఇటువంటి ఇళ్ల కోసం ఒక సారి ఖ‌ర్చు చేస్తే స‌రిపోతుండ‌డంతో వీటికి డిమాండ్ ఎక్కువే. స‌రికొత్త సాంకేతికతను, సృజనాత్మకతను జోడించి ఈ ఆటోమేటిక్ ఇళ్లను త‌యారు చేస్తున్నారు. ఈ ఫోల్డ‌బుల్ హౌసెస్ వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here