స్కాట్లాండ్ లో డైనోసార్ సంచారం?

డైనోసార్ లు బ‌తికే ఉన్నాయా? ఇంకా భూమ్మీద సంచ‌రిస్తున్నాయా? కోట్ల సంవ‌త్స‌రాల క్రితం అంత‌రించిపోయిన డైనోసార్ల జాతి ఇంకా మ‌నుగ‌డ‌లోనే ఉందా? ప‌్ర‌స్తుతం స్కాట్లాండ్ లో ఇటువంటి చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయి. తాజాగా, డైనోసార్ ను పోలిన జీవి ఫొటో ఒక‌టి ఇటువంటి చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మైంది. ఆ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

స్కాట్లాండ్‌లోని కెల్లెర్న్‌ గ్రామంలో జిమ్మీ రైట్‌(66) అనే వ్యక్తి పెంపుడు కుక్క‌తో షికారుకెళ్లాడు. ఆ సమయంలో ఓ వింత జంతువు ప‌క్క‌నే ఉన్న కౌ ఫీల్డ్‌లో  న‌డుచుకుంటూ వెళ్ల‌డాన్ని జిమ్మీ గ‌మ‌నించాడు. మొద‌ట ఆ వింత జీవిని చూసి అత‌డు భ‌య‌ప‌డ్డాడు. నెమ్మ‌దిగా తేరుకొని ఆ వింత జీవిని ఫొటో తీశాడు. ఆ జీవిని చూసి షాక్‌కు గురయ్యానని , అది డైనోసార్‌ను పోలి ఉండటంతో భయమేసిందని జిమ్మీ తెలిపారు. ఫొటో తీసిన వెంటనే ఆ ప్రాంతం నుంచి వ‌చ్చేశాన‌ని ఆయ‌న‌ వెల్లడించారు. ఆ ఫొటోను జిమ్మీ సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది.

దీనిని చూసిన కొంద‌రు నెటిజ‌న్లు అది డైనోసార్ జాతికి చెందింద‌ని కామెంట్ చేస్తున్నారు. అది తాబేలు జాతికి చెందిన జంతువ‌ని మ‌రి కొంద‌రు తేల్చేశారు. అది మాంసాహార జంతువ‌ని, చూడ‌డానికి భ‌యంక‌రంగా ఉంద‌ని భయాందోళనలు వ్యక్తం చేశారు. వేల కోట్ల సంవ‌త్స‌రాల క్రితం అంత‌రించిపోయిన డైనోసార్లు బ‌తికి ఉండ‌డం అసాధ్య‌మ‌ని కొంద‌రు కామెంట్ చేశారు. అక్క‌డ‌క్క‌డా డైనోసార్ల అవ‌శేషాలు మాత్ర‌మే ల‌భించాయ‌ని, ఆ జీవులు బ‌తికి ఉండే చాన్స్ లేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here