పాముల‌తో ఆటాడేస్తున్న బుడ‌త‌డు!

సాధార‌ణంగా ఏడాది వ‌య‌సున్న పిల్ల‌లు బొమ్మ‌ల‌తో ఆడుకుంటుంటారు. ఆ వ‌య‌సులో పిల్ల‌లు బొద్దింక‌ను చూసినా భ‌య‌ప‌డుతుంటారు. ఇక పాముల సంగ‌తి స‌రేస‌రి. కొంత మంది పెద్ద‌వాళ్ల‌కు కూడా పాములంటే చ‌చ్చేంత భ‌యం. కానీ, ఆస్ట్రేలియాకి చెందిన ఓ బుడతడు విషసర్పాలతో ఆటాడేసుకుంటున్నాడు. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా వాటిని మెడ‌లో వేసుకుంటున్న‌ ఈ బుడ‌త‌డిని చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. ఇంట‌ర్నెట్ లో ఆ బుడ‌త‌డి ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

ఆస్ట్రేలియాకు చెందిన‌ జెన్సన్‌ హరిసన్‌ వయసు రెండేళ్లు. అత‌డి తల్లిదండ్రుల టోనీ, బ్రూక్ లు వృత్తిరీత్యా పాములు పడుతుంటారు. ఆ దంప‌తులు వాళ్లింట్లో 300కి పైగా పాములను పెంచుతున్నారు. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టు జెన్సన్‌ పుట్టిన రెండో రోజునే ఓ పాముపిల్లని పట్టుకున్నాడ‌ని అత‌డి తల్లిదండ్రులు చెబుతున్నారు. జెన్సన్‌ అన్నిరకాల పాములను పట్టుకునేందుకు ఉత్సాహ‌ప‌డుతుంటాడ‌ట‌. జెన్స‌న్ పాముల‌తో ఆడుకునేట‌ప్పుడు తాము ద‌గ్గ‌రుండి గ‌మ‌నిస్తుంటామ‌ని అత‌డి త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే, జెన్స‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు విష‌స‌ర్పాల జోలికి వెళ్లలేద‌ని టోనీ చెప్పాడు.

చిన్న‌ప్ప‌టి నుంచి జెన్సన్‌కు పాముల‌తో దోస్తీ చేయడం అలవాటైంది. చిన్న చిన్న పాములు మొద‌లుకొని …. పెద్ద పెద్ద కొండ చిలువ‌ల వ‌ర‌కు జెన్స‌న్ నేస్తాలేన‌ట‌. కొండచిలువ,  గొవన్నాతో ఆడ‌డ‌మంటే జెన్స‌న్ కు మ‌హా స‌ర‌దా. జెన్స‌న్ పాములను పట్టుకునే ఫొటోలను అత‌డి త‌ల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టారు. దీంతో, ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్లు జెన్స‌న్ ను పొగ‌డ్త‌ల‌తో మంచెత్తుతున్నారు. అత‌డి ధైర్య సాహ‌సాల‌ను చూసి తెగ మెచ్చేసుకుంటున్నారు. కొంద‌రైతే అత‌డిని ఏకంగా ‘లిటిల్‌ స్నేక్‌బోయ్‌’ అని పిలిచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాముల‌ను ప‌ట్టుకున్న అతి పిన్న వ‌య‌స్కుడు జెన్స‌న్ అని స్థానిక మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here