`వివేకం`తో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్న అజిత్‌

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అల్రెడి విడుద‌లైన తెలుగు టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. అల్రెడి అజిత్ తెలుగులో ప్రేమ పుస్తకం, ప్రేమ‌లేఖ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. త‌మిళంలో అజిత్ న‌టించిన సూపర్ డూప‌ర్ హిట్ మూవీ `వీరం`ను `వీరుడొక్క‌డే` అనే పేరుతో విడుద‌ల చేశారు. ఇలా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో అజిత్ హీరోగా `వివేకం` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నారు.
110 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో జేమ్స్ బాండ్ త‌ర‌హా మూవీగా వివేకం తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగులో శౌర్యం, శంఖం, ద‌రువు వంటి చిత్రాల‌ను రూపొందించిన శివ అజిత్‌తో  వీరం, వేదాళం వంటి వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను తెర‌కెక్కించారు. ఇప్పుడు  `వివేకం`తో ఈ హిట్ కాంబినేష‌న్ హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్టర్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను త్వ‌రలో విడుద‌ల చేస్తామ‌ని న‌వీన్ శొంఠినేని తెలియ‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here