ఎస్టీల‌కు తెలివి ఉండదు: సీఎం

త‌న సొంత ఇలాక అయిన‌ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న అభివృద్ధి న‌మూనాను వివ‌రిస్తూ గిరిజ‌నుల‌ను కించ‌ప‌ర్చే కామెంట్లు చేశారు. “ఎస్టీలు అడవుల్లో ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. వారికి తెలివి ఉండదు. వారిని కూడా అభివృద్ధి చేస్తాం“ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రశ్నించే ధమ్ము లేక కులమతాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు నియమించిన మంజునాధ కమిషన్‌ నివేదిక వచ్చిన తరువాత దాని ఆధారంగా కాపులను బీసీలో చేరుస్తామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు.
 రాష్ట్రంలోని 28 నీటి ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నా రు. దేశ చరిత్రలోనే హంద్రీ-నీవా లాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే నిర్మి స్తోందన్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నిర్మా ణాలపై సమీక్షలు, ప్రత్యేక సమావేశాలు నిర్వ హిస్తున్నామని, గుత్తేదారులను, అధికారులను సమన్వయం చేస్తూ ప్రాజెక్టులను పూర్తి చేసేందు కు చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలి పారు. శ్రీశైలంకు నీరు వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రాజెక్టుల నిర్మాణానికి కొందరు భూములు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం, విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రయత్నిస్తున్నారని అయినా సరే ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకొని ముందుకు సాగుతామన్నారు. బెల్ట్‌షాప్‌ ఉంటే తాటతీస్తామని హెచ్చరించారు. బెల్ట్‌ షాపుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తనపై ప్రేమాభిమానాలతో 1989 నుంచి గెలిపిస్తూ వచ్చిన కుప్పం నియోజకవర్గంలో తన కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తూ ఉన్నానని చంద్ర‌బాబు అన్నారు. గతంలో ఇజ్రాయిల్‌ ప్రాజెక్టును ఇప్పుడు పంటకుంటలు వంటి పథకాలను ప్రయోగాత్మకంగా ఆరంభించానన్నారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు ఆరు నెలలకోసారి శుభ్రం చేయించే కార్యక్రమాన్ని చేపడ్తామన్నారు. ఉదయం నుంచిరాత్రి 11 గంటల వరకు కొనసాగిన పర్యటనలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు.  ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సర్వే చేయిస్తున్నామని ప్రజల స్పందనకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here