చంద్రబాబు మాటలకు.. పడీ పడీ నవ్వుతున్నారు!

“బాబూ.. కాస్త నోరు జాగ్రత్తగా వాడతారా. లేదంటే.. మీ పరువే పోయేలా ఉంది. అవినీతి.. అక్రమ సంపాదన అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారే. ఇలా మాట్లాడ్డానికి మీకు నోరెలా వస్తోంది? ఒకప్పుడు.. 5 కోట్ల రూపాయలతో ఓ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నంలో.. మీరు అడ్డంగా దొరికి పోయింది నిజమా కాదా చెప్పండి?” అంటూ.. జనం ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా అవినీతి చేస్తే.. ఎవరైనా అక్రమాలు చేస్తే.. ఎవరైనా తప్పుడు మార్గాల్లో సంపాదిస్తే.. పైసా పైసా తిరిగి రాబడతా.. వాళ్ల పాలిట నేను ఛండ శాసనుడిని.. అంటూ బాబుగారు చేసే ప్రగల్భాలను వింటూ పడీపడీ నవ్వుతున్నారు.

మీరేందీ.. ఇలా నీతులు మాట్లాడ్డం ఏందీ అంటూ చంద్రబాబును కాదు.. ఆయన పరివారాన్నీ నిలదీస్తున్నారు. చంద్రబాబు టార్గెట్ ఒక్కటే. అది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. యువ నాయకుడిగా.. ప్రతిపక్ష నేతగా.. ఆయన రోజురోజుకూ బలపడుతున్నారన్నది.. అందరూ అంగీకరించే వాస్తవం. అంతే కాక.. ఈ మధ్య నవరత్నాల్లాంటి హామీలతో.. పార్టీని ప్రజల్లోని తీసుకెళ్లే విధానంలో వైఎస్ జగన్ కొత్త రూట్ ఫాలో అవుతున్నారు. అందుకే.. చంద్రబాబు ఇంతగా ఉలిక్కి పడుతున్నారని జనం కూడా చెబుతున్నారు.

ఇప్పుడు.. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగే ఉప ఎన్నికలో ఓడినా.. గెలిచినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఏమీ ఉండదు. గెలిస్తే.. మహా అయితే.. ఓ ఎమ్మెల్యే బలం పెరుగుతుంది. కానీ.. టీడీపీ పరిస్థితి అలాకాదు. నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. చూస్తుంటే.. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. చంద్రబాబు ఇలా దిగజారి మాట్లాడాల్సి వస్తోందని అంతా చర్చించుకుంటున్నారు.

అందుకే.. నోరు తెరిస్తే.. అవినీతి.. అక్రమాలు అంటూ మాట్లాడుతున్నారని.. జనం అభిప్రాయ పడుతున్నారు. ముందు.. ఓటుకు నోటు లాంటి వ్యవహారాల్లో తన పాత్రపై వాస్తవాలు బయటపెట్టి.. ఆ బ్రీఫింది ఎవరో చెప్పి.. ఆ తర్వాతే.. అక్రమ సంపాదన.. అక్రమ ఆదాయం లాంటి పదాలు వాడితే.. బాబు స్థాయికి మర్యాదగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here